కరోనా తీవ్రత వల్ల భారత్లో లాక్డౌన్ అమల్లో ఉంది. ఈ కారణంగా సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తమకిష్టమైన పనులు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి పరిణితి చోప్రా అదిరిపోయే ఫొటోలను పోస్ట్ చేసింది. ఓ వెడ్డింగ్ మ్యాగజైన్ కోసం పెళ్లికూతురు వేషధారణలో కనిపించి, అభిమానులను ఆశ్చర్యపరిచింది. "పెళ్లికి సిద్ధంగా ఉన్నాను. వరుడు కావలెను" అంటూ ఓ వ్యాఖ్య జోడించింది.
పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ భామకు వరుడు కావలెను
బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా... తన ఇన్స్టాగ్రామ్లో పెళ్లి కూతురు వేషధారణలో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచింది. వరుడు కావలెను అంటూ క్యాప్షన్ జోడించింది.
లాక్డౌన్ వేళ పెళ్లికూతురుగా పరిణితి చోప్రా
ఈ ఫోటోలపై ప్రియాంక చోప్రా సహా మిగతా సెలబ్రిటీలు అందరూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలో 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందీ పరిణితి.
ఇదీ చూడండి : సీతాపహరణం చూస్తూ 'రావణాసురుడు' భావోద్వేగం