'ఆర్‌ఎక్స్ 100'తో అలరించిన కథానాయిక పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా.. తేజస్ కంచెర్ల హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్డీఎక్స్ లవ్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం.
"వేటాడాలనుకున్న మగాడికి ఆడపిల్ల లేడిపిల్లలా కనిపించొచ్చు. అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకి సింహం కూడా కుక్కపిల్లలా కనిపిస్తుంది" అంటూ పాయల్ పలికే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.