'ఆర్ఎక్స్ 100' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల భామ పాయల్ రాజ్‌పుత్. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ 'ఆర్‌డీఎక్స్ లవ్' అనే చిత్రం చేస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.
టీజర్: 'ఆర్ఎక్స్ 100'ను మించిపోయిందిగా! - payal rajput
పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచర్ల హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'ఆర్‌డీఎక్స్ లవ్'. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
ఆర్‌డీఎక్స్
డబుల్ మీనింగ్ డైలాగ్స్, రొమాంటిక్ సన్నివేశాలతో మరోసారి పాయల్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించాడు. తేజస్ కంచర్ల హీరోగా నటిస్తున్నాడు . సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇవీ చూడండి.. ప్రభాస్ తర్వాతి సినిమా అలా ఉండబోతోంది..!
Last Updated : Sep 28, 2019, 5:16 PM IST