మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్-దర్శకుడు శంకర్ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న సినిమాకు సంగీత దర్శకుడు ఖరారు చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 135 మంది మ్యూజిషియన్లతో కలిసి తమన్ తొలి రికార్డింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించింది.
ఈ సినిమా కోసం మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, జానీ మాస్టర్‌ను ప్రధాన కొరియోగ్రాఫర్ ఇప్పటికే ఎంపిక చేశారు. కియారా అడ్వాణీని హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రం.. రాజకీయ నేఫథ్య కథతో తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.