తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాస్​ మహారాజ్​ జోరు.. ఉగాదికి ముహూర్తం - త్రినాథరావు నక్కిన వార్తలు

మాస్​ మహారాజ్​ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఉగాది సందర్భంగా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఇందులో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది.

Raviteja's new movie pooja ceremony to be held on Ugadi
మాస్​ మహారాజ్​ జోరు.. ఉగాదికి ముహూర్తం

By

Published : Mar 24, 2021, 6:36 AM IST

కథానాయకుడు రవితేజ వేగం పెంచారు. సంక్రాంతికి 'క్రాక్‌'తో విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం 'ఖిలాడి'తో బిజీగా గడుపుతున్నారు. తదుపరి త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. ఈ వేసవిలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఆ చిత్రాన్ని ఉగాది సందర్భంగా ప్రారంభించబోతున్నారు.

ఆ మేరకు ముహూర్తం కుదిరినట్టు తెలిసింది. ఇందులో రవితేజ సరసన ఇద్దరు భామలు ఆడిపాడనున్నారు. కన్నడ తార శ్రీలీల, తమిళ చిత్రాల్లో మెరిసిన ఐశ్వర్య మేనన్‌తోపాటు.. లవ్‌లీ సింగ్‌ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

ఇదీ చూడండి:రామ్​చరణ్ 'డ్రైవింగ్ లైసెన్స్'​లో రవితేజ?

ABOUT THE AUTHOR

...view details