వరుస సినిమాలతో జోరుమీదున్న మాస్ మహారాజా రవితేజ(raviteja latest movies).. మరో సినిమా ప్రకటించారు. 'స్వామిరారా' ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'రావణాసుర' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో రవితేజ(ravi teja new movie 2021) విభిన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
'రావణాసుర'గా రవితేజ.. స్పీడ్ మామూలుగా లేదుగా! - రవితేజ సుధీర్ వర్మ కొత్త చిత్రం టైటిల్
మాస్ మహారాజా రవితేజ(raviteja latest movies) మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. 'స్వామిరారా' ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

రవితేజ
ఇప్పటికే 'ఖిలాడి', 'ధమాకా', 'రామారావు ఆన్ డ్యూటీ', 'టైగర్ నాగేశ్వరావు' చిత్రాలు ప్రకటించిన రవితేజ(ravi teja new movie 2021).. ఇప్పుడు 'రావణాసుర' అంటూ ముందుకొచ్చారు. ఇలా వరుస చిత్రాలతో జోరుమీదున్న ఇతడిని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.