తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మల్టీస్టారర్ మలయాళం రీమేక్​లో రానా-రవితేజ! - మలయాళం రీమేక్​లో రానా రవితేజ

త్వరలోనే రవితేజ-రానా ఓ మల్టీస్టారర్​ సినిమా చేయనున్నట్లు టాక్​. మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' తెలుగు రీమేక్​లో నటించనున్నట్లు సమాచారం.

rana-raviteja
రానా-రవితేజ

By

Published : Jun 10, 2020, 8:04 AM IST

Updated : Jun 10, 2020, 9:05 AM IST

తమ అభిమాన హీరోలు కలిసి మల్టీస్టారర్​ సినిమా చేస్తుంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం టాలీవుడ్​లో అదే ట్రెండ్​ కొనసాగుతోంది. అయితే తాజాగా టాలీవుడ్​లో మరో మల్టీస్టారర్​ రాబోతున్నట్లు టాక్​. రవితేజ-రానా కలిసి మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' రీమేక్​లో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

చిత్రీకరణలకి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఈ సినిమాతో పాటు నితిన్‌ 'రంగ్‌దే', నాని 'శ్యామ్‌ సింగరాయ్‌', నాగశౌర్య - లక్ష్మీ సౌజన్య కలయికలో సినిమాల్ని ఆగస్టులో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే తెలుగులో మల్టీస్టారర్​గా వచ్చిన 'గోపాల గోపాల', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' 'ఎఫ్​ 2' సహా పలు చిత్రాలు హిట్​గా నిలిచాయి.

ఇది చూడండి : 'తను నన్ను బాలా అని పిలుస్తాడు'

Last Updated : Jun 10, 2020, 9:05 AM IST

ABOUT THE AUTHOR

...view details