మాస్ మహారాజా రవితేజ.. 'క్రాక్' సినిమా విజయం తర్వాత జోరు పెంచారు. వరుస సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ వాటిని పట్టాలెక్కించే పనిలో బిజీ అయ్యారు.
ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి', త్రినాథరావు నక్కిన, శరత్ మండవతో మరో రెండు చిత్రాల్లో నటిస్తుండగా.. ఇప్పుడు 'దొంగాట' ఫేం దర్శకుడు వంశీకృష్ణతో ఓ మూవీ చేసేందుకు పచ్చజెండా ఊపారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇందులో రవితేజ ఓ కొత్త గెటప్‌లో కనిపించనున్నారని తెలిసింది. త్వరలోనే అధికారక ప్రకటన వచ్చే అవకాశముంది. తాను కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యాక ఇది ప్రారంభిస్తారట. ఈ లోపల వంశీకృష్ణ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు.