రవితేజ కథానాయకుడిగా రమేశ్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
'రాక్షసుడు' దర్శకుడితో మాస్ మహారాజ్ - రాక్షసుడు సినిమా దర్శకుడు రమేశ్ వర్మ
'రాక్షసుడు' సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు రమేశ్‌వర్మ.. కథానాయకుడు రవితేజ కోసం ఓ కథ సిద్ధం చేశారట. ఈ సినిమాను వాణిజ్యాంశాలతో వినోదాత్మకంగా తెరకెక్కించబోతున్నామని నిర్మాత వెల్లడించారు.

'రాక్షసుడు' దర్శకుడితో మాస్ మహారాజ్
నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ.. "రమేశ్ వర్మ దర్శకత్వంలో మేం నిర్మించిన 'రాక్షసుడు' మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడాయన రవితేజ కోసం చక్కని స్క్రిప్ట్ రాసుకున్నారు. వాణిజ్యాంశాలతో నిండిన వినోదాత్మక కథగా చిత్రాన్ని రూపొందించనున్నాం. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం" అన్నారు.
ఇదీ చూడండి..'ప్రపంచంలో రష్మిక కంటే అందగత్తె ఎవరు?'