Ravi teja birthday poster: మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా' సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చేశాయి. రవితేజకు బర్త్డే విషెస్ చెబుతూ పోస్టర్స్ రిలీజ్ చేశారు.
వీటిలో ఖిలాడి.. ఫిబ్రవరి 10న, రామారావు ఆన్ డ్యూటీ.. మార్చి 25న థియేటర్లలోకి రానుంది. వీటితోపాటు ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
Konda trailer: రాజకీయ నాయకుడు కొండా మురళి జీవితం ఆధారంగా తీసిన సినిమా 'కొండా'. ఈ చిత్ర ట్రైలర్ను బుధవారం రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆసక్తిగా ఉన్న ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఇందులో అదిత్, ఇర్రా మోర్.. కొండా మురళి, సురేశ్ పాత్రల్లో నటించారు.