తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రవితేజ​ కొత్త చిత్రం.. 'సర్కారు వారి పాట' రెండో షెడ్యూల్​ - సర్కారు వారి పాట సెకండ్​ షెడ్యూల్

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. రవితేజ కొత్త సినిమా ప్రారంభం సహా ఉగాది నుంచి 'సర్కారు వారి పాట' కొత్త షెడ్యూల్​ షూటింగ్ జరుపుకొంటోంది.

raviteja new movie launched
రవితేజ​ కొత్త చిత్రం.. 'సర్కారు వారి పాట' రెండో షెడ్యూల్​

By

Published : Apr 13, 2021, 1:27 PM IST

మాస్​ మహారాజ్​ రవితేజ కథానాయకుడిగా శరత్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రవితేజ క్లాప్‌ కొట్టారు. నిర్మాత 'మైత్రి' రవి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. టైటిల్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు.

క్లాప్​ కొడుతున్న రవితేజ
కెమెరా స్విచ్​ ఆన్​ చేస్తున్న 'మైత్రి' రవి
రవితేజ కొత్త సినిమా చిత్రబృందం

సూపర్​స్టార్​ మహేశ్​బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. కీర్తి సురేశ్​ కథానాయిక. పరుశురామ్​ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా రెండో షెడ్యూల్​ ఉగాది నుంచి ప్రారంభమైంది. ఇదే విషయాన్ని సోషల్​మీడియాలో ప్రకటించింది చిత్రబృందం.

'సర్కారు వారి పాట' పోస్టర్​

ఇదీ చూడండి:బోయపాటి సినిమాలో 'అఖండ'గా బాలయ్య

ABOUT THE AUTHOR

...view details