తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రవితేజ కొత్త లుక్​.. డ్యూయెట్​తో విజయ్ 'బీస్ట్' - మూవీ న్యూస్

టాలీవుడ్ సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రవితేజ 68వ సినిమా, విజయ్ 'బీస్ట్', వెంకీ-వరుణ్ 'ఎఫ్3', సుధీర్​బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', కంగన 'తలైవి' చిత్రాల సంగతులు ఉన్నాయి.

Raviteja new movie, F3, Beast go on floors today
మూవీ న్యూస్

By

Published : Jul 1, 2021, 12:32 PM IST

మాస్ మహారాజా కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా పోస్టర్​ను విడుదల చేశారు. #RT68 వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ.. నిజాయతీ గల అడ్వకేట్​గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. శరత్ మాండవ దర్శకత్వం వహిస్తుండగా, రవితేజ తొలిసారి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రవితేజ కొత్త సినిమా పోస్టర్

తళపతి విజయ్ 'బీస్ట్' షూటింగ్​ చెన్నైలో గురువారం ప్రారంభమైంది. విజయ్-పూజా హెగ్డేలపై డ్యూయెట్​ను చిత్రీకరించనున్నారు. నెల్సన్​ దిలీప్​ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్​ పిక్చర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్​లుక్ విడుదల చేయగా, అభిమానుల్ని అవి తెగ ఆకట్టుకుంటున్నాయి.

విజయ్ పూజా హెగ్డే బీస్ట్ మూవీ

వీటితో పాటు వెంకటేశ్-వరుణ్​తేజ్ 'ఎఫ్3' షూటింగ్ తిరిగి ప్రారంభమవగా, సుధీర్​బాబు-మోహన్​కృష్ణ ఇంద్రగంటి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రీకరణ గురువారం నుంచే హైదరాబాద్​లో మొదలైంది.

కంగనా రనౌత్ 'తలైవి' సినిమా కొత్త స్టిల్స్ విడుదలయ్యాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్ పూర్తయినప్పటికీ లాక్​డౌన్​ ప్రభావం వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. మరి సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుందో చూడాలి?

తలైవి కొత్త పోస్టర్
తలైవి కొత్త పోస్టర్
తలైవి కొత్త పోస్టర్
తలైవి కొత్త పోస్టర్
.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details