తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రవితేజ 'క్రాక్' మూవీకి పాజిటివ్ రిపోర్ట్స్! - raviteja krack review

కొవిడ్​కు ముందు వరుస డిజాస్టర్లతో నిరాశపరిచాడు మాస్​మహారాజా రవితేజ. అయితే ఆయనకు కీలక సమయంలో హిట్​ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్​ మలినేనితో 'క్రాక్' అనే చిత్రం చేశాడు. ఈ సినిమా నేడు (శనివారం) విడుదలైంది.

raviteja Krack movie twitter review
రవితేజ.. కమ్​బ్యాక్​ విజయవంతమైందా? క్రాక్​ ట్విట్టర్​ రివ్యూ

By

Published : Jan 9, 2021, 9:08 AM IST

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో వచ్చిన 'క్రాక్‌' చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ట్విట్టర్​లో అభిమానులు ఇది రవితేజకు మంచి కమ్​బ్యాక్ సినిమా అని అంటున్నారు. అమెరికా సహ పలు ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రంపై నెటిజన్లు ఇప్పటికే తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

'క్రాక్'​ హిట్ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్​కు కృతజ్ఞతలు తెలిపారు మాస్​ మహారాజా ఫ్యాన్స్.

'డాన్‌ శీను', 'బ‌లుపు' లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హాట్రిక్ సినిమా ఇది. కరోనా లాక్‌డౌన్ అనంతరం దాదాపు 9 నెలల తర్వాత సంక్రాంతి బరిలో ప్రేక్షకుల మందుకు వచ్చిన మొదటి చిత్రం ఇదే. రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వరుస డిజాస్టర్స్‌తో పూర్తిగా ఇమేజ్ పడిపోతున్న సమయంలో రవితేజతో 'బలుపు' సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. మరోసారి ఆ మ్యాజిక్​ రిపీట్​ అయిందో లేదో తెలియాలంటే పూర్తి రివ్యూలు వచ్చే వరకు ఆగాల్సిందే. 'క్రాక్​'లో సీనియర్ నటులు సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.

ఇదీ చూడండి:'కేజీఎఫ్ 2' టీజర్​ రికార్డు.. 24 గంటల్లోనే

ABOUT THE AUTHOR

...view details