తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రవితేజ 'క్రాక్' వాయిదా.. రేపటి నుంచి థియేటర్లలో! - రవితేజ క్రాక్ ఉదయం ఆట

రవితేజ హీరోగా నటించిన 'క్రాక్' సినిమా నేడు (శనివారం) విడుదలవ్వాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షోస్ నిలిచిపోయాయి.

raviteja Krack movie morning show cancel
మాస్ ​మహారాజా 'క్రాక్'.. ఉదయం ఆట రద్దు

By

Published : Jan 9, 2021, 10:07 AM IST

Updated : Jan 9, 2021, 2:31 PM IST

మాస్ మ‌హారాజా ర‌వితేజ, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్​లో తెరకెక్కిన చిత్రం క్రాక్. నేడు (శనివారం) భారీ స్థాయిలో రిలీజ్ కావాల్సి ఉంది. నిర్మాత ఠాగూర్ మధు సినిమా పనిలో చెన్నైలో ఉండటం వల్ల.. షో విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. దీంతో ఈరోజు సినిమా విడుదలయ్యే అవకాశం లేదు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ర‌వితేజ.. మరోసారి పవర్​ఫుల్ పోలీస్​ ఆఫీసర్​ పాత్రలో నటించారు. ఇది ఆయన 66వ చిత్రం.

'క్రాక్'​లో మాస్ ​మహారాజ సరసన శ్రుతి హాసన్ నటించింది. ఇక వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్​ రెస్పాన్స్​తో దూసుకుపోతుంది.

ఇదీ చూడండి:రవితేజ 'క్రాక్' మూవీకి పాజిటివ్ రిపోర్ట్స్!

Last Updated : Jan 9, 2021, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details