తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పాప నవ్వుతో మొదలైన 'కిక్'కు​ 11ఏళ్లు - కిక్​ సినిమాకు 11ఏళ్లు పూర్తిచేసుకుందజి

మాస్​మహారాజా రవితేజ 'కిక్'​ సినిమాకు నేటితో 11 ఏళ్లు పూర్తయింది. ప్రేక్షకులకు ఇప్పటికీ ఈ చిత్రాన్ని అభిమానిస్తున్నారంటే, ఎంతలా అలరించిందో అర్థం చేసుకోవచ్చు.

kick
కిక్​

By

Published : May 8, 2020, 7:29 PM IST

మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ, ఇలియానా అందం, తమన్ సంగీతం​, అలీ, బ్రహ్మానందంల హాస్య సన్నివేశాలు, అప్పుడప్పుడు యాక్షన్.. ఇలా ఒకటేంటి ప్రతి సీన్​లోనూ ప్రేక్షకులకు 'కిక్'​ను అందించే సినిమా 'కిక్'. సురేందర్​రెడ్డి దర్శకత్వం వహించారు. విడుదలై నేటికి 11 ఏళ్లయింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు. ​

కిక్​

పాప నవ్వుతో

కథానాయకుడు బాగా చదువుకున్న వ్యక్తి. అయితే అతనికి ఉద్యోగం చేయడం నచ్చదు. ప్రతిరోజూ కొత్తదనం కావాలి. చేసే ప్రతి పనిలోనూ 'కిక్' ఉండాలి. అతనికి అసలైన కిక్‌ ఓ పాప చిరునవ్వులో దొరుకుతుంది. అలాంటి నవ్వు.. వందల, వేల చిన్నారుల ముఖాల్లో కురిపించేందుకు దొంగగా మారాలి. ఇలాంటి కథతో సినిమా మొదలు పెట్టినప్పుడు దర్శకుడు సురేందర్‌ రెడ్డి, రవితేజ ఊహించారో ,లేదో? ఇది వాళ్లిద్దరి కెరీర్‌కు మరిచిపోలేని 'కిక్‌' ఇస్తుందని.

అంతా 'కిక్కే'

ఈ సినిమాలో ప్రతీ అంశం ప్రేక్షకులకు 'కిక్'​ను అందిస్తుంది. రవితేజ బాడీ లాంగ్వేజ్‌ను, ఈ కథను వేరుగా చూడలేం. కల్యాణ్‌ పాత్రలో తనదైన ఎనర్జీతో సినిమా మొత్తాన్ని హుషారెత్తించాడు. నైనాగా ఇలియానా అందం, అభినయంతో కుర్రకారు మతులు పోగొట్టింది. పోలీసు అధికారి కల్యాణ్‌ కృష్ణ పాత్రలో శ్యామ్ నటన అందరి దృష్టిని ఆకర్షించింది. షాయాజీ షిండే, బ్రహ్మానందం, వేణు మాధవ్‌, బెనర్జీ, కోట శ్రీనివాసరావు, అలీ, జయప్రకాశ్‌ రెడ్డి తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

ఈ సినిమాకు మరో ప్రధాన బలం మ్యూజిక్. ఈ చిత్రంతోనే మణిశర్మ శిష్యుడు ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. తొలి సినిమాకే మంచి స్వరాలు అందించి గురువుకు తగ్గ శిష్యుడనిపించుకున్నాడు. నేపథ్య సంగీతంలోనూ తనదైన ముద్ర వేశాడు‌. 'ఐ డోంట్‌ వాంట్ లవ్‌', 'గోరే గొగ్గొరే', 'బాసూ మనకు మెమొరీ లాసు' గీతాలు విశేషణ ఆదరణ పొందాయి.

వాడి కిక్​ ఆగదు

ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా అబ్బూరి రవి మాటలు రాశారు. 'పాప నవ్వుతో మొదలైంది వాడి కిక్‌.. ఆగదు' అని ఓ సందర్భంలో షాయాజీ షిండే చెప్పినట్లు రవితేజ అందించిన 'కిక్‌' ఎన్నడూ ఆగలేదు. అనంతరం కొన్నాళ్లకు కిక్​ సీక్వెల్​ 'కిక్‌ 2' వచ్చినా, ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.

ABOUT THE AUTHOR

...view details