మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి'నంటూ రెడీ అవుతున్నారు. ఆయన పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుంచి వీడియో గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కంటైనర్ బాక్సుల మధ్యలో రవితేజ స్టైలిష్‌గా ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది.
రవితేజ 'ఖిలాడి' ఎంట్రీ అదిరిందిగా! - రవితేజ ఖిలాడి
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న కొత్త చిత్రం 'ఖిలాడి'. నేడు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
రవితేజ 'ఖిలాడి' ఎంట్రీ అదిరిందిగా!
రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతికి 'క్రాక్'తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రవితేజ 'ఖిలాడి'తో మరొక హిట్ కోసం రెడీ అవుతున్నారు. మరి ఆ గ్లింప్స్‌ను మీరూ చూడండి..!