తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గోవాలో చిందేస్తోన్న రవితేజ, శ్రుతిహాసన్ - రవితేజ కొత్త సినిమా

మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న 'క్రాక్'​ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. అక్కడ చివరి పాటను తెరకెక్కిస్తున్నారు.

crack
గోవాలో 'క్రాక్' ఆటాపాట

By

Published : Dec 6, 2020, 6:02 PM IST

మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'క్రాక్‌'. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతోంది. ఇందులో పోలీసు అధికారి వీర శంకర్‌ పాత్రలో కనిపించనున్నారు రవితేజ.

రవితేజ

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఆదివారం అక్కడి సుందరమైన ప్రదేశాల్లో నాయకానాయికలపై ఓ పాటను చిత్రీకరించారు. తమన్‌ సంగీతం అందించిన ఈ గీతానికి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాజు సుందరం.. రవితేజ, శ్రుతిహాసన్‌తో స్టెప్పులు వేయించారు.

శ్రుతిహాసన్

ఈ షూటింగ్​కు సంబంధించిన ఫొటోల్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. 2021 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సముద్ర ఖని కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. 'డాన్‌శీను', 'బలుపు' చిత్రాల తర్వాత రవితేజ-గోపీచంద్‌ కలయికలో వస్తున్న మూడో చిత్రమిది.

ఇదీ చదవండి:'పద్మావత్'​లో ప్రభాస్ అందుకే నటించలేదు!

ABOUT THE AUTHOR

...view details