Ravindra Jadeja Pushpa: క్రికెటర్లలోకి బాగా దూసుకెళ్లిపోయాడు పుష్పరాజ్! అంతర్జాతీయ క్రికెటర్లు ఇప్పటికే చాలామంది 'పుష్ప' సినిమాలోని డ్యాన్సులు, డైలాగులతో అదరగొడుతున్నారు. శ్రీలంకతో తొలి టీ20 ద్వారా పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మ్యాచ్ మధ్యలో పుష్ప శైలిని అనుకరించడం విశేషం. తన బౌలింగ్‌లో చండిమాల్‌ను ఔట్ చేసిన అతడు పుష్పరాజ్ తరహాలో 'తగ్గేదేలే' అన్నట్లుగా సంజ్ఞ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు.
జడేజా సెలెబ్రేషన్స్‌కి విజిల్స్.. వికెట్ తీశాక 'తగ్గేదేలే' - రవీంద్ర జడేజా
Ravindra Jadeja Pushpa: మరోసారి పుష్పరాజ్‌గా అదరగొట్టాడు టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా చండిమల్ వికెట్ తీసిన అతడు.. తగ్గేదేలే అంటూ చేసుకున్న సెలబ్రేషన్ విపరీతంగా అలరిస్తోంది.
ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అవుతోంది. సర్ పుష్పరాజ్ అని కొందరు.. రవీంద్ర పుష్ప జడేజా అని కొందరు అభిమానులు ఈ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. 'పుష్ప' సినిమా విడుదల అయిన కొత్తలో ఆ సినిమాలో అల్లు అర్జున్ మాదిరే 'తగ్గేదేలే' అని డైలాగ్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజా పెట్టిన వీడియో బాగా హిట్ అయింది. గతేడాది నవంబర్‌లోని న్యూజిలాండ్‌తో సిరీస్‌లో గాయపడిన జడ్డూ మళ్లీ మైదానంలో కనబడడం ఇదే తొలిసారి.
ఇదీ చూడండి:'పుష్ప' మేనియా.. స్టార్ క్రికెటర్స్ ఎక్కడా తగ్గట్లేదుగా!