తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Chiranjeevi Movies: మెగాస్టార్ సినిమాలో మాస్ మహారాజా! - రవితేజ వార్తలు

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Movies), మాస్ మహారాజా రవితేజ(Ravi Teja Latest Movie).. ఒకే స్క్రీన్​పై సందడి చేయనున్నట్లు సమాచారం. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న 154వ సినిమాలో రవితేజ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi
చిరు

By

Published : Sep 29, 2021, 7:11 AM IST

Updated : Sep 29, 2021, 10:41 AM IST

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Movies) సినిమాలో రవితేజ(Ravi Teja Latest Movie) నటించనున్నారా? ఆ మేరకు చర్చలు ఊపందుకున్నాయా?- ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. చిరు కథానాయకుడిగా కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ దసరాకే చిత్రీకరణ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో చిరుతోపాటు మరో కథానాయకుడు చేయాల్సిన ఓ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం రవితేజను(Ravi Teja Latest Movie) సంప్రదించినట్టు, చర్చలు సాగుతున్నట్టు తెలిసింది.

గతంలోనూ..

చిరంజీవి(Chiranjeevi Latest Movie) సినిమాలో రవితేజ నటించడం కొత్తేమీ కాదు. 'అన్నయ్య'తోపాటు 'శంకర్‌దాదా జిందాబాద్‌'లోనూ మెరిశారు రవితేజ. అన్నీ కుదిరితే మరోసారి ఆ ఇద్దరూ కలిసి సందడి చేయనున్నారు.

చిరంజీవి 'ఆచార్య'(Acharya Release Date) షూటింగ్ పూర్తిచేసుకుని.. విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు ఆయన.. 'గాడ్​ఫాదర్'​, మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళాశంకర్​' చిత్రాలు చేస్తున్నారు. మరోవైపు రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ', 'ఖిలాడీ'(Khiladi Ravi Teja Release Date) సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

ఇదీ చదవండి:'నాలోని అజ్ఞానమే ఈ కథకు స్ఫూర్తి'

Last Updated : Sep 29, 2021, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details