Ravi teja chiranjeevi: మాస్ మాహారాజా రవితేజ 'రావణాసుర' సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. క్లాప్ కూడా ఆయనే కొట్టారు.
రవితేజ 'రావణాసుర' షురూ.. క్లాప్ కొట్టిన మెగాస్టార్ - రవితేజ చిరంజీవి రావణాసుర మూవీ లాంచ్
Ravi teja ravanasura movie: మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా, రవితేజ కొత్త సినిమా పూజా కార్యక్రమం జరిగింది. 'రావణాసుర' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రవితేజ రావణాసుర మూవీ
మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజతోపాటు యువ కథానాయకుడు సుశాంత్ నటిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, పూజిత, మేఘా ఆకాశ్, అను ఇమ్మన్యూయేల్, దక్షా నగర్కార్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
ఈ నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని, ఈ ఏడాది సెప్టెంబరు 30 సినిమా థియేటర్లలోకి రానుందని చిత్రబృందం వెల్లడించింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.
Last Updated : Jan 14, 2022, 5:00 PM IST