మెగాస్టార్ చిరంజీవి.. కరోనా నుంచి త్వరగా బయటపడాలని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వీరిలో చిరు కోడలు ఉపాసన, హీరో రవితేజ, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, సుధీర్‌బాబు, గోపీచంద్ మలినేని, సంపత్ నంది తదితరులు ఉన్నారు.
చిరంజీవి త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీల ట్వీట్లు - megastar chiranjeevi corona
కొవిడ్ బారిన పడ్డ అగ్ర కథానాయకుడు చిరంజీవి.. త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ నటీనటులు ట్వీట్లు చేస్తున్నారు. సోమవారమే తనకు పాజిటివ్‌గా తేలినట్లు చిరు వెల్లడించారు.

చిరంజీవి త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీల ట్వీట్లు
'ఆచార్య' షూటింగ్లో సోమవారం నుంచి తిరిగి పాల్గొనడంలో భాగంగా టెస్ట్‌లు చేయించుకోగా, చిరుకు వైరస్ సోకినట్లు తేలింది. వెంటనే ఆ విషయాన్ని ట్వీట్ చేశారు. గత 4-5 రోజుల్లో తనను కలిసిన వారు వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇది చదవండి:మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్