తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రవితేజ మల్టీస్టారర్.. 'బంగార్రాజు' ప్రమోషన్స్​ షురూ - indrani super girl

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇప్పటికే వరుస చిత్రాలతో బిజీగా ఉన్న మాస్​ మహారాజా రవితేజ మల్టీస్టారర్​, బంగార్రాజు ప్రమోషన్స్​ సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

బంగార్రాజు
ravi teja

By

Published : Jan 7, 2022, 10:31 PM IST

మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలతో జోరుమీదున్నారు. ఇప్పటికే 'ఖిలాడి', రామారావు ఆన్​ డ్యూటీ చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన.. ఇటీవలే రావణాసుర సినిమా​ ఓకే చేశారు. తాజాగా ఓ మల్టీస్టారర్​ చేయనున్నారు రవితేజ. తమిళ హీరో విష్ణువిశాల్​తో కలిసి నటించనున్నారు. ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేయనున్నారు.

విష్ణు విశాల్​తో రవితేజ

'బంగార్రాజు' ప్రమోషన్స్​

'బంగార్రాజు' ప్రమోషన్స్​ను మొదలుపెట్టింది చిత్రబృందం. ప్రచారం కోసం హీరోలు నాగార్జున, నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టి పయనమయ్యారు. కరోనా ఉద్ధృతిలోనూ సంక్రాంతి కానుకగా జనవరి 14నే సినిమాను విడుదల చేస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు.

'రౌడీ బాయ్స్'​ ట్రైలర్​ -తారక్

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సోదరుడైన శిరీష్‌ తనయుడు ఆశీష్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'రౌడీబాయ్స్' (rowdy boys movie)​. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్​ను యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ జనవరి 8న సాయంత్రం 6 గంటలకు రిలీజ్​ చేయనున్నారు.

తారక్​ చేతుల మీదుగా 'రౌడీ బాయ్స్​' ట్రైలర్

'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ సినిమా నుంచి 'డేట్ నైట్' అనే పాట ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. పూర్తి పాటను శుక్రవారం విడుదల చేయనున్నారు.

ఇండియన్ సూపర్​గర్ల్​..

సూపర్​ హీరో సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇలాంటి సినిమాల్లో ఎక్కువగా కథానాయకులే హీరోలుగా ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు భారత్​లో లేవు! అందుకే తొలి భారత సూపర్​గర్ల్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు స్టీఫెన్. ఆ సినిమా పేరే 'ఇంద్రానీ'. ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి:సమంత 'ఊ అంటావా..' ఫుల్​ వీడియో సాంగ్ వచ్చేసింది

ABOUT THE AUTHOR

...view details