"ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే" అనే డైలాగ్‌తో ప్రారంభమైన 'క్రాక్' టీజర్ అంచనాల్ని పెంచుతోంది. ఈ రోజే(శుక్రవారం) ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా సందడి చేయనున్నాడు.
'క్రాక్' టీజర్: రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే మర్డరే - tollywood news
'క్రాక్' చిత్ర టీజర్ నేడు(శుక్రవారం) విడుదలైంది. ఇందులో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. మే 8న రానుందీ సినిమా.
!['క్రాక్' టీజర్: రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే మర్డరే 'క్రాక్' టీజర్: రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే మర్డరే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6155557-868-6155557-1582292620116.jpg)
క్రాక్ సినిమా రవితేజ
'ఒరే అప్పిగా, సుబ్బిగా నువ్వు ఎవడైతే నాకేంట్రా డొప్పిగా' అంటూ రవితేజ చెప్పిన పంచ్ డైలాగ్.. అభిమానులతో ఈల వేయిస్తోంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని ప్రతినాయక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.
గతంలో రవితేజ-గోపీచంద్ కాంబినేషన్‌లో వచ్చిన 'డాన్‌శీను', 'బలుపు' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. మరి మే8న రానున్న 'క్రాక్' ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Last Updated : Mar 2, 2020, 2:40 AM IST