మాస్ మహరాజ్ రవితేజ, దర్శకుడు రమేశ్ వర్మ కాంబోలో రూపొందుతోన్న 'ఖిలాడి' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. మే 28న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. మార్చి నెలాఖరు కల్లా చిత్రీకరణ పూర్తి చేసుకోవాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'లవ్‌స్టోరి'. ఏప్రిల్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని 'ఏవో ఏవో కలలే' లిరికల్ వీడియోను మార్చి 25న ఉదయం 10.08 గంటలకు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
కబడ్డీలో గుర్తింపు లభించని ఛాంపియన్ జీవితాధారంగా 'అర్జున్ చక్రవర్తి' చిత్రం రూపొందనుంది. శ్రీని గుబ్బాల నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. వేణు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను పాన్ఇండియా స్థాయిలో తెరక్కించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విజయ్ రామరాజు, శీజారోజ్ ప్రధానపాత్రల్లో నటించనున్నారు.