తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రవితేజ 'ఖిలాడి' ట్రైలర్​.. విజయ్​ 'బీస్ట్'​ సాంగ్​ అప్డేట్​ - Sehari movie

Ravi Teja Khiladi Movie Trailer: మాస్​ మహారాజా రవితేజ నటించిన 'ఖిలాడి' ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. మరోవైపు తమిళ స్టార్​ హీరో విజయ్ నటిస్తున్న 'బీస్ట్' నుంచి ఫస్ట్​ సింగిల్​కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.

ravi teja khiladi movie trailer
vijay beast first single

By

Published : Feb 7, 2022, 6:52 PM IST

Ravi Teja Khiladi Movie Trailer: మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఖిలాడి' ట్రైలర్​ విడుదలైంది. పంచ్​ డైలాగులతో ఆకట్టుకోవడం సహా సినిమాలో చాలా స్టైలిష్​గా కనిపించారు రవితేజ. ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలోకి రానుంది. ఇటీవలే సెన్సార్​ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూబైఏ సర్టిఫికెట్​ సొంతం చేసుకుంది.

'ఖిలాడి'లో రవితేజ.. ద్విపాత్రాభినయం చేశారు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు.

Vijay Beast First Single: తమిళ సూపర్​స్టార్​ విజయ్ నటించిన 'బీస్ట్' చిత్రం నుంచి తొలి పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. 'అరబిక్ కుత్తు' అనే ఈ పాటను ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పాట లిరిక్స్​ను ప్రముఖ హీరో శివకార్తికేయన్​ రాయడం విశేషం.

ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్​గా చేస్తోంది. నెల్సన్ దిలీప్​ కుమార్ దర్శకుడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. సన్​పిక్చర్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

Sehari movie: రొమాంటిక్ ఎంటర్​టైనర్​ 'సెహరి' మేకింగ్ వీడియో విడుదలై అలరిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలకానుంది. ఇందులో సిమ్రన్ చౌదరి హీరోయిన్​గా నటించింది. జ్ఞానశేఖర్ ద్వారక దర్శకత్వం వహించారు.

ఇదీ చూడండి:'సర్కారు వారి పాట' క్రేజీ అప్డేట్​ వచ్చేసింది

ABOUT THE AUTHOR

...view details