తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రవితేజ కొత్త సినిమా కూడా ఓటీటీలోనే! - రవితేజ ఖిలాడీ

మాస్ మహారాజా రవితేజ హీరో నటిస్తున్న 'ఖిలాడి' చిత్రాన్ని ఓటీటీలో తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమై క్లారీటీ రావాల్సి ఉంది.

ravi teja khiladi movie in OTT
రవితేజ

By

Published : May 14, 2021, 6:07 PM IST

Updated : May 14, 2021, 6:38 PM IST

రవితేజ కథానాయకుడిగా, రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఖిలాడి'. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విడుదలను వాయిదా వేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. "ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సినిమా విడుదలను కొంతకాలం వాయిదా వేస్తున్నాం. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తాం" అని తెలిపింది.

అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. చిత్రానికి సంబంధించిన ప్రసార హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.

పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Last Updated : May 14, 2021, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details