Ravi Teja Khiladi Movie: మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి'.. ఫిబ్రవరి 11న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యూబైఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది.
'ఖిలాడి' సినిమాలో రవితేజ.. ద్విపాత్రాభినయం చేశారు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు.
ఆనంద్ యాక్షన్..
Anand Deverakonda New Movie: 'దొరసాని', 'మిడిల్ క్లాస్ మెలొడీస్', 'పుష్పక విమానం' తదితర క్లాస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటుడు ఆనంద్ దేవరకొండ. తొలిసారి ఆయన ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి 'గం గం గణేశా' అనే టైటిల్ ఖరారైంది.
ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. ఆనంద్ ప్రస్తుతం 'బేబీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకుడు.