తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Raviteja daksha: రవితేజకు విలన్​గా హాట్​బ్యూటీ - రవితేజ మూవీస్

Raviteja ravanasura movie: రవితేజ కొత్త సినిమాలో విలన్​గా హాట్​బ్యూటీని ఎంపిక చేయాలని చిత్రబృందం చూస్తోంది. దాదాపు ఖరారైపోయినట్లేనని తెలుస్తోంది.

daksha nagarkar villain
హీరోయిన్ దక్షా నగర్కార్

By

Published : Jan 6, 2022, 6:23 AM IST

రవితేజ కథానాయకుడిగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' అనే చిత్రం రూపొందనుంది. అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్రబృందం.

రవితేజ రావణాసుర మూవీ

ఇందులో రవితేజ కోసం ఓ శక్తిమంతమైన లేడీ విలన్‌ పాత్రను తీర్చిదిద్దినట్లు తెలిసింది. ఇప్పుడా పాత్ర కోసం దక్షా నగార్కర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. తన పాత్ర నచ్చడం వల్ల సినిమా చేసేందుకు దక్షా ఒకే చెప్పిందని ప్రచారం వినిపిస్తోంది.

'హుషారు', 'జాంబిరెడ్డి' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముంబయి సోయగం ఆమె. ప్రస్తుతం ప్రతి నాయికగా అలరించేందుకు సిద్ధమవడం ఆసక్తిరేకెత్తిస్తోంది. ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా సందడి చేయనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details