తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​-రానా​ మల్టీస్టారర్​కు కొత్త సినిమాటోగ్రాఫర్​ - Sagar K. Chandra

పవన్​ - రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్​ చిత్రం నుంచి సినిమాటోగ్రాఫర్​ ప్రసాద్​ మూరేళ్ల తప్పుకొన్నారు. ఇప్పుడా స్థానంలో రవి.కె.చంద్రన్​ను చిత్రబృందం ఎంపిక చేసింది.

Ravi K Chandran to replace Prasad Murella as the cinematographer of 'PSPK Rana Movie'?
పవన్​-రానా​ మల్టీస్టారర్​కు కొత్త సినిమాటోగ్రాఫర్​

By

Published : Jul 29, 2021, 8:37 PM IST

మలయాళ సూపర్​హిట్​ చిత్రం 'అయ్యప్పనుమ్​ కోషియుమ్​'(Ayyappanum Koshiyum) తెలుగు రీమేక్​లో పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ (Pawan Kalyan)-రానా దగ్గుబాటి(Rana Daggubati) కలిసి నటిస్తున్నారు. కరోనా సంక్షోభం తర్వాత ఇటీవలే షూటింగ్​ను తిరిగి ప్రారంభించారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్​గా పనిచేస్తున్న ప్రసాద్​ మూరెళ్ల(Prasad Murella) ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. సినిమాకు డేట్లు సర్దుబాటు చేయలేని కారణంగా ఆయన​ వైదొలిగినట్లు తెలుస్తోంది. ప్రసాద్​ స్థానంలో రవి.కె.చంద్రన్​(Ravi K. Chandran)ను చిత్రబృందం ఎంపిక చేసింది.

టైటిల్​ ఇదేనా?

ఈ సినిమాకు టైటిల్​ ఇదేనంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. 'పరశురామ కృష్ణమూర్తి' అనే టైటిల్​ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ టైటిల్​ను రిజిష్టర్​ చేసి ఆగస్టులో అధికారికంగా ప్రకటించనున్నారని టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్'కు (Ayyappanum Koshiyum) రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్​కల్యాణ్.. బీమ్లా నాయక్​ అనే పవర్​ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​ పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇటీవలే విడుదలైన ఆ పాత్ర పరిచయ వీడియో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో పవన్​, రానాతో పాటు ఐశ్వర్యారాజేశ్​(Aishwarya Rajesh), నిత్యామేనన్(Nithya Menen)​ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర (Sagar K. Chandra) దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram Srinivas) మాటల రచయితగా వ్యవహరించనున్నారు.

ఇదీ చూడండి..పవన్​-రానా సినిమాలోని సన్నివేశం లీక్​!

ABOUT THE AUTHOR

...view details