మలయాళ సూపర్‌హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్'(Ayyappan Koshyum) తెలుగు రీమేక్‌లో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) - రానా దగ్గుబాటి(Rana Daggubati) కలిసి నటిస్తున్నారు. కరోనా సంక్షోభం తర్వాత ఇటీవలే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ప్రసాద్ మూరెళ్ల(Prasad Murella) ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు టాలీవుడ్లో జోరుగు ప్రచారం జరుగుతోంది. సినిమాకు డేట్లు సర్దుబాటు చేయలేని కారణంగా ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రసాద్ స్థానంలో రవి కే చంద్రన్‌ను(Ravi K. Chandran) చిత్రబృందం ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
టైటిల్ ఇదేనా?