దర్శకుడిగా మారిన నటుడు రవిబాబు. నటనలో ఎంత వైవిధ్యం చూపించాడో దర్శకత్వంలోనూ తనదైన ముద్ర వేశాడు. మొదటి నుంచి రొటీన్ కథలకు విభిన్నంగా సినిమాలు తెరకెక్కించే రవి ప్రస్తుతం నూతన నటీనటులతో 'ఆవిరి' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
సినిమా రవిబాబుది.. విడుదల దిల్రాజుది - dil raju
టాలీవుడ్ దర్శకుడు రవిబాబు ప్రస్తుతం 'ఆవిరి' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్‌రాజు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడట.
రవిబాబు
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడట. స్టార్ హీరో ప్రాజెక్టులను నిర్మించే దిల్‌రాజు కథ బాగుంటే చిన్న సినిమాలను ప్రోత్సహిస్తాడనే విషయం తెలిసిందే. రవిబాబు కథ నచ్చడం వల్ల ఈ ప్రాజెక్టుకు తన సహాయ సహకారం అందించే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.
Last Updated : Sep 30, 2019, 3:58 AM IST