టాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలకు చిరునామాగా నిలిచాడు నటుడు-దర్శకుడు రవిబాబు. ఇతడు తెరకెక్కించిన 'ఆవిరి'.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
"ఆవిరి' హారర్ సినిమా కాదు, ఫ్యామిలీ థ్రిల్లర్. అంతకు ముందు చేసిన 'అదుగో' నిర్మాణానంతర కార్యక్రమాలకే రెండున్నరేళ్లు పట్టింది. ఆ సమయంలో ఎలాంటి చిత్రం చేయాలని బాగా ఆలోచించేవాడిని. ఆ సమయంలో, అప్పటి వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి బంగ్లాలో దెయ్యం ఉందనే కథనాన్ని పేపర్‌లో చూశాను. అది చదివిన తర్వాత నాకొక ఆలోచన వచ్చింది. కానీ 'ఆవిరి' ఒక ఫిక్షనల్ కథ"