బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇప్పుడు మరోసారి నటిగా బిజీగా ఉంది. ప్రముఖ కన్నడ నటుడు యష్ హీరోగా ‘కె.జి.ఎఫ్: ఛాప్టర్2’ చిత్రం చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటించనున్నట్లు సమాచారం.
ఇందిరా గాంధీగారవీనా..నటించనుందని వార్తలొస్తున్నాయి. చిత్రంలో రామికా సేన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు చిత్ర బృందం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.
కేవలం ఇందిరా గాంధిని ఆదర్శంగా తీసుకొనే.. చిత్రంలోని రామిక సేన్’ పాత్రను తయారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో రవీనా పాత్ర గురించి తెలుసుకోవాలంటే వచ్చే వేసవి వరకు వేచి చూడాల్సిందే.
గతంలోనే రవీనా టాండన్ మాధుర్ భండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్తా'లో అనురాధ వివేక్ చౌహాన్ అనే రాజకీయ నాయకురాలి పాత్రలో నటించి మెప్పించింది.
ఇదీ చదవండి: అల్లుడు శీనుతో 'ఇస్మార్ట్ భామ' రొమాన్స్..!