తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తన బెర్తు తానే శుభ్రం చేసుకున్న హీరోయిన్ - కరోనా వార్తలు

నటి, హీరోయిన్ రవీనా టండన్.. రైలు ప్రయాణం చేస్తూ, తన బెర్త్​ను తానే శుభ్రం చేసుకుంది. కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలని నెటిజన్లకు చెప్పింది.

తన బెర్త్ తానే శుభ్రం చేసుకున్న హీరోయిన్
నటి రవీనా టండన్

By

Published : Mar 21, 2020, 8:24 PM IST

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా చేతులు శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్క్​లు ధరించడం చేస్తున్నారు. తాజాగా రైలు ప్రయాణం చేసిన నటి రవీనా టండన్.. తన బెర్తు​ను తానే శానిటైజర్​తో శుభ్రం చేసుకుంది. ఆ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని రాసుకొచ్చింది. మీ కోసమే కాకుండా చుట్టూ ఉండే వారికోసం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. మాస్క్ ఉపయోగించే విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలంది.

ABOUT THE AUTHOR

...view details