తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాశీఖన్నా దానికోసమే ఎదురుచూస్తోందట! - Rashikhanna chat with audience in twitter

లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన హీరోయిన్​ రాశీఖన్నా... ట్విట్టర్​లో తన అభిమానులతో సరదాగా ముచ్చటించింది. తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వారితో పంచుకుంది.

Rasikhanna special interview
లాక్​డౌన్​ విరామాన్ని 'రాశీఖన్నా' ఎలా అస్వాదిస్తుందంటే?​

By

Published : May 4, 2020, 8:07 AM IST

Updated : May 4, 2020, 8:53 AM IST

"మహేష్‌బాబు, అల్లు అర్జున్‌లతో నటించడానికి ఎదురుచూస్తున్నా" అంటోంది కథానాయిక రాశీ ఖన్నా. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆమె ట్విటర్‌లో అభిమానులతో చిట్‌ చాట్‌గా ముచ్చటించింది. తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది..

ఈ లాక్‌డౌన్‌లో మీకు స్ఫూర్తిగా నిలుస్తున్న అంశాలేంటి?

సాధ్యమైనంతవరకు నేనెప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటానికే ప్రయత్నిస్తుంటా. అందు కోసం ఈ సమయంలో పుస్తకాలు చదువుతున్నా. స్ఫూర్తిని రగిలించే వీడియోలు చూస్తున్నా.

ఎప్పుడూ ఇలా పాజిటివ్‌గా.. చక్కగా నవ్వుతూ ఉండటం మీకెలా సాధ్యమవుతుంది?

నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు ఇలా నా చుట్టూ ఉన్న వాళ్ల నుంచి నేను పొందుతున్న ప్రేమే నాలో సంతోషాన్ని నింపుతుంది.

థియేటర్లో చూసిన తొలి చిత్రం?

టైటానిక్‌.

పెద్దలు కుదిర్చిన పెళ్లి.. ప్రేమ వివాహం. మీ ఓటు దేనికి?

నాకు తెలిసి ప్రేమ వివాహమే.

మహేష్‌బాబుతో సినిమా ఎప్పుడు?

నేను దాని కోసమే ఎదురు చూస్తున్నా. త్వరలో ఆ కల నెరవేరొచ్చేమో.

'రాశీఖన్నా'

తెలుగులో మీ అభిమాన కథానాయిక?

సమంత.

అల్లు అర్జున్‌పై మీ అభిప్రాయం?

తన చుట్టూ ఉన్న వాళ్లని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన నటనంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా.

తెలుగు ప్రేక్షకులు?

నా ప్రాణం.

ఆల్‌టైం ఫేవరెట్‌ సినిమా?

ద ప్రపోజల్‌.

ప్రస్తుతం చేస్తున్న చిత్రాలేమిటి?

తమిళంలో ‘అరన్‌మనై 3’తో పాటు సూర్య చిత్రంలో నటిస్తున్నా. త్వరలో తెలుగులో రెండు చిత్రాలు చేయబోతున్నా.

నమ్మే స్ఫూర్తి వాక్యం?

మార్పు మాత్రమే స్థిరమైంది.

నాని గురించి ఒక్క మాటలో?

ఐదు మాటల్లో చెప్తా. చాలా మంచి వాడు. గొప్ప ప్రతిభాశాలి.

'రాశీఖన్నా'
Last Updated : May 4, 2020, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details