'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన 'జిల్' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. జిల్లు మనే అందాలతో కుర్రకారుల మతులు పోగొడుతున్న ఈ గ్లామర్ డాల్ 'జై లవకుశ' సినిమాలో అగ్రహీరో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అనంతరం తమిళ, తెలుగు సహ పలు భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం..
రాశీఖన్నా 1990 నవంబర్ 30న దిల్లీలో జన్మించింది. బీఏ చదివింది. చిన్నప్పుడు ఐఏఎస్ కావాలని అనుకునేదట.
2013లో హిందీ చిత్రం మద్రాస్ కేఫ్‌తో వెండితెర అరంగేట్రం చేసింది.
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా తెలుగుతెరకు పరిచయమైంది.