కథానాయికలు వెబ్‌సిరీస్‌ల్లో మెరిసేందుకు మక్కువ ప్రదర్శిస్తున్నారు. సమంత, తమన్నా, సాయిపల్లవి... తదితర దక్షిణాది తారలంతా ఇప్పటికే ఈ అవకాశాలు అందుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో కథానాయిక రాశీ ఖన్నా చేరింది. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షాహిద్ కపూర్‌తో కలిసి రాశీ ఖన్నా ఓ వెబ్‌సిరీస్‌లో సందడి చేయనుంది. రాజ్ - డి.కె దర్శక ద్వయం యాక్షన్ థ్రిల్లర్ కథతో వెబ్‌సిరీస్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
ఆ జాబితాలోకి హీరోయిన్ రాశీఖన్నా - షాహిద్ కపూర్‌తో రాశీఖన్నా
రాజ్-డి.కె దర్శక ద్వయం దర్శకత్వంలో రానున్న ఓ వెబ్‌సిరీస్‌లో హీరోయిన్ రాశీఖన్నా నటించనుంది. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.
రాశీఖన్నా
వచ్చే జనవరిలోనే చిత్రీకరణ మొదలు కానున్నట్టు సమాచారం. షాహిద్ కపూర్‌తోపాటు దక్షిణాదికి చెందిన విజయ్ సేతుపతి తదితర తారలు అందులో నటిస్తున్నట్టు తెలిసింది. రాశీ ఖన్నా కూడా అవకాశం సొంతం చేసుకుంది. రాజ్ - డి.కె రూపొందిస్తున్న 'ది ఫ్యామిలీ మేన్ 2'తోనే సమంత వెబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.
ఇదీ చూడండి :పెళ్లి కోసం 'సుప్రీమ్' భామ ముస్తాబు