తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రష్మిక-దేవరకొండ లవ్​ట్రాక్​పై మహేశ్​బాబు ట్వీట్​ - vijay and mahesh babu war

గీత గోవిందం చిత్రంతో హిట్​ పెయిర్​గా పేరు తెచ్చుకుంది విజయ్‌ దేవరకొండ - రష్మికల జోడీ. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లోనే ‘డియర్‌ కామ్రేడ్‌’ సిద్ధమవుతోంది. అయితే ఈ ఇద్దరి మధ్య లవ్​ ట్రాక్​ నడుస్తుందన్న గుసగుసలపై స్పందించారు రష్మిక, రౌడీ హీరో.

రష్మిక-దేవరకొండ లవ్​ట్రాక్​పై మహేశ్​బాబు ట్వీట్​

By

Published : Jun 7, 2019, 6:51 AM IST

డియర్​ కామ్రేడ్​ చిత్రంతో మరోసారి జోడీగా వస్తున్నారు రష్మిక - విజయ్​ దేవరకొండ. ఇప్పటికే విడుదలైనఈ సినిమా టీజర్లు, పాటల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇటీవల ఓ టీవీ ఛానల్‌ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ జోడీ అక్కడ చాలా హంగామా చేసింది. ఫలితంగా ప్రేక్షకుల్లో వీరిద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందనే ఊహాగానాలను రేకెత్తించింది.

తాజాగా ఈ వ్యవహారంపై రష్మిక ట్విట్టర్​ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. దానికి విజయ్‌ దేవరకొండ, మహేష్‌బాబులు స్పందించిన విధానం ఇప్పుడు నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

" నేను విజయ్‌ దేవరకొండ మంచి స్నేహితులు మాత్రమే. మా ఇద్దరి మధ్య ఏమీలేదు" అంటూ దేవరకొండను ట్యాగ్‌ చేసి రష్మిక ట్వీట్‌ చేయగా.. దానిపై రౌడీ హీరో తనదైన శైలిలో స్పందించాడు.

" ఓహో నీ తర్వాతి సినిమాలో మహేష్‌బాబుతో కలిసి నటించబోతున్నావు కదా.. ఇప్పుడు నేను నీకు జస్ట్‌ ఫ్రెండ్‌నే అంటావా" అంటూ జవాబిచ్చాడు విజయ్​. అయితే అనూహ్యంగా దీనిపై మహేష్‌బాబు స్పందిస్తూ షాకింగ్‌ ట్వీట్‌ చేశారు.

" సిస్టర్‌ అన్ని ఆశలు పెట్టుకోకు. నాకు ఆల్రెడీ పెళ్లయింది" అని రష్మికకు ఆ ట్వీట్‌ను ట్యాగ్‌ చేశారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో ఆ ట్వీట్‌ను తొలగించారు. కానీ, అప్పటికే నెటిజన్లు ఆ సరదా సంభాషణను స్క్రీన్‌ షాట్ల రూపంలో సేవ్‌ చేసేశారు.. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది.

రష్మిక ట్వీట్​పై విజయ్​-మహేశ్​ జవాబులు
  • ప్రస్తుతం రష్మిక మహేష్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తోంది. అనిల్‌ రావిపూడి దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • విజయ్‌ - రష్మిక కలిసి నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ జులై 26న థియేటర్లలోకి రాబోతుంది.

ABOUT THE AUTHOR

...view details