'ఆచార్య'లో చరణ్ కోసం రష్మిక! - rashmika latest news
'ఆచార్య' కీలకపాత్రలో నటిస్తున్న రామ్‌చరణ్ కోసం హీరోయిన్ను వెతుకుతోంది చిత్రబృందం. దీనికోసం హీరోయిన్ రష్మికను సంప్రదించినట్లు తెలుస్తోంది.
!['ఆచార్య'లో చరణ్ కోసం రష్మిక! RASHMIKA TO BE CONSIDERED HEROINE FOR RAM CHARAN IN ACHARYA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8758376-947-8758376-1599786160762.jpg)
'ఆచార్య'లో హీరోయిన్ల సందడి ఎక్కువగానే ఉండబోతోంది. కాజల్, రెజీనా... ఇలా ఆ జాబితా కాస్త పెద్దగానే ఉంటుంది. చిరు సరసన కాజల్ కథానాయికగా నటిస్తుంది. రెజీనా ప్రత్యేక గీతంలో సందడి చేయనుంది. ఇందులో రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలో మెరవనున్నారు. అతడికి జోడీ కావాలి. చరణ్ కోసం ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మలను సంప్రదించారు. కియారా అడ్వాణీ మొదలుకొని పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు చిత్రబృందం రష్మికను సంప్రదించినట్టు సమాచారం. రష్మిక ఇప్పటికే 'పుష్ప'లో నటించేందుకు ఒప్పుకుంది. 'ఆచార్య'లోనూ ఆమె నటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.