స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటోంది నటి పూజాహెగ్డే. ప్రస్తుతం ఆమె ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్', అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రాలతో బిజీగా ఉంది. అలాగే 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'పుష్ప'లో ఛాన్స్ కొట్టేసింది.
ఒకే సినిమాలో సందడి చేయనున్న స్టార్ హీరోయిన్లు! - రష్మిక వార్తలు
ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో కలిసి సందడి చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో ఇద్దరు నాయికలకు చోటుండగా.. ఆ పాత్రల కోసం పూజాహెగ్డే, రష్మికలను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ స్టార్ హీరోయిన్స్ ఇద్దరూ త్వరలోనే కలిసి వెండితెరపై సందడి చేయనున్నారని సమాచారం. 'పడిపడి లేచె మనసు' చిత్రం తర్వాత దర్శకుడు హనురాఘవపూడి.. దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా ప్రకటించాడు. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, రష్మికలను కథానాయికలుగా చూపించనున్నారట దర్శకుడు హను. ఈ విషయమై ఇప్పటికే ఆయన ఈ ఇద్దర్నీ సంప్రదించగా.. వాళ్లూ అందుకు అంగీకారం ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతున్న ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ చూడండి:ఆ పాత్రల్లో నటించి మెప్పించాలనుంది: పాయల్