తెలంగాణ

telangana

By

Published : Dec 12, 2019, 9:28 AM IST

ETV Bharat / sitara

చాలా రోజుల తర్వాత కనిపించిన రష్మిక!

హీరోయిన్ రష్మిక ఉన్న కొత్త పోస్టర్​లను అభిమానులతో పంచుకుంది 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

mahesh-rashmika
'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్​-రష్మిక

ఇటీవలే కాలంలో 'సరిలేరు నీకెవ్వరు' టీజర్​, పాటలు విడుదల చేస్తున్నా.. అభిమానుల నుంచి ఒకే ప్రశ్న ఎదురవుతోంది. హీరోయిన్ రష్మిక ఎక్కడ? అని. ఈ విషయంపై మీమ్స్, ట్రోల్స్​ సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తున్నాయి. వీటిన్నింటికీ తెర దించుతూ ఆమె ఉన్న రెండు కొత్త పోస్టర్లను పంచుకుంది చిత్రబృందం. ఆమె అభిమానులు ప్రస్తుతం తెగ ఆనందపడిపోతున్నారు.

'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్​-రష్మిక

ఈ సినిమాలో మహేశ్​బాబు.. మేజర్ అజయ్​కృష్ణగా కనిపించబోతున్నాడు. విజయశాంతి, ప్రకాశ్​రాజు, సంగీత, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్​రాజు-అనిల్ సుంకర-మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మించారు. వచ్చే నెల 11న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: ఈ హీరోయిన్లతో ఆ దర్శకుల కాంబినేషన్ అదుర్స్!

ABOUT THE AUTHOR

...view details