ముద్దుగుమ్మ రష్మిక.. బంపర్ ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు వికాస్ బాల్ తీస్తున్న ఈ సినిమాలో నీనా గుప్తా సహ భారీ తారాగణం నటించనున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. తండ్రి కూతురి మధ్య సాగే ఈ కథకు 'డెడ్లీ' టైటిల్ను పరిశీలిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చిలో మొదలు కానుంది.