తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రామ్​చరణ్​-శంకర్​ సినిమాలో జర్నలిస్టుగా రష్మిక! - రామ్​చరణ్​ శంకర్​

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​-దర్శకుడు శంకర్​ కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో కథానాయికగా రష్మిక మంధాన ఎంపికైనందని సమాచారం. అయితే ఆమె ఓ జర్నలిస్టు పాత్ర పోషించనుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Rashmika Mandanna to play the role of a journalist in RC 15
రామ్​చరణ్​-శంకర్​ సినిమాలో జర్నలిస్టుగా రష్మిక!

By

Published : Apr 16, 2021, 9:40 AM IST

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో 'ఆర్‌సి 15' వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కునుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మంధాన కథానాయికగా నటించనుందని సమాచారం. అయితే ఆమె ఇందులో జర్నలిస్టుగా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శంకర్ చెప్పిన కథ నచ్చడం వల్ల నటించేందుకు ఆమె అంగీకరించిందట. అయితే అధికారికంగా చిత్రబృందం ఎక్కడా ప్రకటించలేదు. సినిమా జులై 15న సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

రాజకీయ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కనుందని.. రామ్‌చరణ్‌ ఇందులో ముఖ్యమంత్రిగా కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు చిత్రంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో పాటు చిరంజీవి కూడా నటిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది సినిమాను తెలుగు, తమిళం, హిందీలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రష్మిక.. అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప', హీరో శర్వానంద్‌తో కలిసి 'ఆడవాళ్లు మీకు జోహార్లు'లో నాయికగా నటిస్తోంది. బాలీవుడ్​లో సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తోన్న 'మిషన్‌ మజ్ను'తో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'గుడ్‌బై' చిత్రంలో నటిస్తోంది.

ఇదీ చూడండి:నా పొరపాటుకు మన్నించండి: తనికెళ్ల భరణి

ABOUT THE AUTHOR

...view details