నితిన్, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'భీష్మ'. విభిన్న కథతో పూర్తి ఎంటర్టైనర్గా రూపొందుతోందీ సినిమా. తాజాగా 'భీష్మ' లైఫ్ స్టోరీ ఇదే అని అంటోంది నటి రష్మిక. తాజాగా నితిన్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో పంచుకుందీ అందాల భామ. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేడు ఈ చిత్రం నుంచి సింగిల్స్ యాంథమ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో నితిన్ వింటేజ్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. వీడియోను షేర్ చేసిన రష్మిక దానికి ఓ సందేశాన్ని జోడించింది.
"హ్యాపీ సింగిల్స్ డే, హ్యాపీ వాలెంటైన్స్ డే..!! ఈ వీడియో సాంగ్‌ను చూసి ఆనందించండి. ఇదే 'భీష్మ' జీవిత కథ."