తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎన్టీఆర్​ సరసన ముద్దుగుమ్మ రష్మిక! - రష్మిక కొత్త సినిమా

ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్​లో రూపొందే కొత్త చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో హీరోయిన్​గా రష్మిక నటిస్తోందనే వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విషయం నిజమా? కాదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Rashmika Mandanna Heroine For NTR And Trivikram Film | Jr NTR | Trivikram Srinivas
ఎన్టీఆర్​ సరసన రష్మిక..!

By

Published : Jan 27, 2020, 8:10 AM IST

Updated : Feb 28, 2020, 2:44 AM IST

ఈ సంక్రాంతికి వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'లో హీరోయిన్​ అందర్ని మెప్పించింది రష్మిక. వచ్చే నెల్లో రానున్న 'భీష్మ'లో నితిన్‌కు జోడీగా కనిపించబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె అంగీకరించిన చిత్రాలేవీ లేవు. అయితే ఆమె ఎన్టీఆర్ సరసన నటిస్తుంది అనే వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

పులితో పోరాటం

ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్‌. రాజమౌళి దర్శకుడు. రామ్‌చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్‌ బయటకు వచ్చేసింది. పులితో ఎన్టీఆర్‌ పోరాటం చేస్తున్న ఘట్టమది. ఎన్టీఆర్‌ పరిచయం నేపథ్యంలో ఈ సన్నివేశం వస్తుందని తెలుస్తోంది. ఇందులో చాలా కీలకమైన సన్నివేశం కాస్త లీక్‌ అవడం వల్ల చిత్రబృందం అప్రమత్తమైంది. ఆన్‌లైన్‌లో అందుకు సంబంధించిన లింకులన్నీ తొలగించింది. ఇది వరకే ఈ చిత్రం లీకుల బారిన పడింది. ఇక మీదట లీకేజీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది.

ఇదీ చదవండి: మహేశ్‌ మోకాలికి త్వరలో శస్త్ర చికిత్స.. సినిమాలకు బ్రేక్​!

Last Updated : Feb 28, 2020, 2:44 AM IST

ABOUT THE AUTHOR

...view details