Vijay devarakonda rashmika: యువహీరో విజయ్ దేవరకొండ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. వీరిద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే కానీ క్రేజ్ మాత్రం ఫుల్‌గా సొంతం చేసుకున్నారు. అయితే ఈ జంట.. ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలెక్కనుందంటూ తెగ వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఇటీవల ఆమె ప్రేమ, పెళ్లి గురించి కూడా మాట్లాడింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన విజయ్ సోషల్‌మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అవాస్తమని స్పష్టత ఇచ్చారు.
ప్రస్తుతం 'లైగర్'తో బిజీగా ఉన్న విజయ్.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ 'జనగణమన', సుకుమార్‌తో ఓ సినిమా, శివ నిర్వాణతో ఓ చిత్రం చేయనున్నారు. 'పుష్ప'తో బంపర్ హిట్ అందుకున్న రష్మిక కూడా 'పుష్ప 2' షూటింగ్‌కు సిద్ధమవుతుంది. ఆమె హీరోయిన్గా చేసిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. మార్చి 4న థియేటర్లలోకి రానుంది. హిందీలోనూ పలు సినిమాలు చేస్తోంది.