ఎన్టీఆర్, రష్మిక కలిసి నటించనున్నారా? అంటే అవుననే తెగ చర్చించుకుంటున్నారు సినీ వర్గాలు, నెటిజన్లు. ఎందుకంటే త్రివిక్రమ్‌ను ఈ భామ కలవడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వెంటనే అభిమానులు ట్రెండింగ్ చేయడం ప్రారంభించేశారు.
త్రివిక్రమ్ తన కొత్త సినిమాను ఎన్టీఆర్‌తో తీయనున్నారు. 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమా కథ వినడం కోసమే రష్మిక.. త్రివిక్రమ్‌ను కలిసిందని తెలిసింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.