తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్​ సినిమా కోసం ఫ్యామిలీతో రష్మిక ఫైట్​! - vijay devarakonda

విజయ్​తో రెండో సారి కలిసి నటించేందుకు తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని, కథ నచ్చి ఫ్యామిలీతో ఫైట్ చేసి మరీ చిత్రంలో నటించానని చెప్పింది డియర్ కామ్రేడ్​ హీరోయిన్ రష్మిక. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది.

రష్మిక

By

Published : Jul 26, 2019, 5:31 AM IST

విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్న కలిసి నటించిన కొత్త చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ అనేది ఉపశీర్షిక. ఈ సబ్​టైటిల్​కు తగినట్టుగానే ఇంట్లోవాళ్లతో ఫైట్ చేసిందంట రష్మిక. విజయ్​తో ఇంకో సినిమా చేస్తానంటే వాళ్లు ఒప్పుకోనందుకే కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడని చెప్పిందీ కన్నడ సుందరి. డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయం చెప్పింది.

"దర్శకుడు భరత్ కథ నాకు బాగా నచ్చింది. కచ్చితంగా సినిమా చేయాలని అనుకున్నా. కానీ విజయ్‌తో ఇంకో సినిమా ఎందుకు, చెయ్యొద్దు అంటూ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు. ఇక్కడ ఎవరితో చేస్తున్నామన్నది విషయం కాదు.. ఈ స్ర్కిప్టు నేను చేయాలి అంతే అని చెప్పి సినిమాలో అడుగుపెట్టా" -రష్మిక మందణ్న

రష్మిక ఇంతకు ముందు విజయ్​తో కలిసి గీతగోవిందం సినిమాలో నటించింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన డియర్​కామ్రేడ్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్ యేర్నేని, రవిశంకర్ తదితరులు నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ పాటలు శ్రోతల్నీ అలరిస్తున్నాయి.

ఇది చదవండి: 'పోకిరి'లో కంగనాను ఊహించగలమా!

ABOUT THE AUTHOR

...view details