వరుస సినిమాలు చేస్తున్న రష్మిక మందణ్న... మరో క్రేజీ అవకాశం సొంతం చేసుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్గా నటించనుంది. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
బర్త్‌డే బాయ్ సరసన రష్మిక మందణ్న - MYTHRI MOVIE MAKERS
ముద్దుగుమ్మ రష్మిక మందణ్న అల్లు అర్జున్‌తో నటించనుంది. ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ట్విట్టర్లో ఆనందాన్ని పంచుకుంది.
అల్లు అర్జున్‌తో నటించేందుకు సిద్ధమైన రష్మిక మంధాన
ఇప్పటికే రష్మిక నటిస్తున్న డియర్ కామ్రేడ్.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నితిన్‌తో భీష్మ సినిమాలోనూ నటించేందుకు అంగీకరించింది.
సుకుమార్, అల్లు అర్జున్‌తో... ఆర్య, ఆర్య-2 లాంటి ప్రేమకథల్ని తెరకెక్కించాడు. మరి ఇప్పుడు ఎలాంటి భిన్నమైన సినిమా తీస్తారో చూడాల్సిందే.
Last Updated : Apr 8, 2019, 10:07 AM IST