Vaishnav tej new movie: 'ఉప్పెన', 'కొండపొలం' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగాహీరో వైష్ణవ్ తేజ్ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆయన హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో ఓ సినిమా రూపొందనుంది. నేడు(గురువారం) వైష్ణవ్ పుట్టినరోజు సందర్భంగా వీడియో రూపంలో ప్రకటనను విడుదల చేశాయి.
Alluarjun pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' సినిమా ఇటీవల విడుదల ఘనవిజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దేశవ్యాప్తంగా అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమా విజయంపై స్పందించిన హీరోయిన్ రష్మిక.. హర్షం వ్యక్తం చేసింది. 'పుష్ప 2'.. తొలి భాగం కన్నా మరింత ఉత్తమంగా, అద్భుతంగా ఉంటుందని హామి ఇచ్చింది.